గ్రామపంచాయతీ కార్యాలయం ముందు తెరాస జెండాను ఆవిష్కరించిన సంఘటన ఇది. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మాధన్ హిప్పర్గ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా గద్దెకు తెరాస జెండాను సర్పంచ్ రాజు పటేల్ ఆవిష్కరించారు.
పంచాయతీ కార్యాలయమా?.. పార్టీ కార్యాలయామా? అని సర్పంచ్‌ను స్థానికులు నిలదీశారు. జెండా దిమ్మెతో పాటు జెండా కర్ర కూడా పంచాయతీదేనని వారు గుర్తు చేశారు. పార్టీ కోసం ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.