తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో తెరాస బైక్​ ర్యాలీ - ఎమ్మెల్యే గంప గోవర్దన్​ తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కామారెడ్డిలో భారత్​ బంద్ కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్​.. తెరాస శ్రేణులతో కలిసి బైక్​ ర్యాలీ నిర్వహించారు. ​

trs bike ryally in kamareddy for support to bharath bandu
కామారెడ్డిలో బైక్​ ర్యాలీ నిర్వహించిన తెరాస

By

Published : Dec 8, 2020, 12:02 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత్​ బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వా విప్ గంప గోవర్దన్.. తెరాస శ్రేణులతో కలిసి బైక్​ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గోవర్దన్​ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. వెంటనే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:బంద్​కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు

ABOUT THE AUTHOR

...view details