కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం 44వ జాతీయ రహదారిపై 30 మంది వలస కూలీలు ఉదయం నడుచుకుంటూ తమ సొంత ఊరికి బయలుదేరారు. సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు సుమారు 700 కి.మీ.లు నడక ప్రారంభించారు.
కాలినడకన మధ్యప్రదేశ్‌కు పయనం
వారంతా వలస కూలీలు.. రెక్కాడితే గానీ డొక్కాడదు.. లాక్డౌన్ నేపథ్యంలో పట్టణంలో పనులు దొరకడంలేదు. పస్తులుండాల్సి వస్తోంది. అందకే తమ సొంత ఊళ్లకు పయమయ్యారు. సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడకన వెళ్తున్నారు. రవాణా సౌకర్యాలు సైతం బంద్ కావడం వల్ల కాళ్లనే నమ్ముకున్నామని చెబుతున్నారు.
కాలినడకన మధ్యప్రదేశ్‌కు పయనం
లాక్డౌన్ కారణంగా తమకు ఉపాధి లభించడం లేదని వారు వాపోయారు. పట్టణంలో ఉంటే పనులు లేక పస్తులుండాల్సి వస్తుందన్నారు. అందుకే తమ సొంత ఊళ్లకు పయనం అయ్యామని పేర్కొన్నారు. బస్సులు, ఇతర వాహనాలు నడవకపోవడం వల్ల కాళ్లనే నమ్ముకొని వెళ్తున్నామని తెలిపారు. దారిలో ఆకలి వేస్తే తినడానికి కొంత ఆహారం తీసుకువెళ్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి :పరిమళించిన మానవత్వం.. అన్నార్థులకు చేయూత