దేశవ్యాప్త నిరసనలో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని కార్మికుల సంఘాల నాయకులు అన్నారు. లాక్డౌన్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాలు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కార్మిక కుటుంబానికి, పేద కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇవ్వాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణలను ఆపాలని వారు డిమాండ్ చేశారు.
కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల నిరసన - kamareddy district news
కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. లాక్డౌన్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాలు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, కరోనా నియంత్రణ కోసం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
![కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల నిరసన trade unions protest in front of kamareddy collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7885688-1010-7885688-1593851108223.jpg)
బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేయడం ఆపాలన్నారు. బొగ్గు, రక్షణ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రైల్వే ఫార్మా రంగాల్లో ఎఫ్‌డీఐలను నిలిపి వేయాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఎల్.దశరథ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగన్న, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కంటోన్మెంట్‌లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి