కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలతో పాటు రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. గతంలో గ్రామాలు ప్రగతికి నోచుకునేవి కాదని, కూలిపోయే స్థితిలో ఇళ్లు, మురికి కాలువలు దర్శనమిచ్చేవన్నారు. గ్రామాల్లో భూములకు రెక్కలు రావడం వల్ల దహన సంస్కారాలకు సైతం భూమి లేని పరిస్థితి నెలకొందన్నారు.
కామారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ల పంపిణీ - ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గత 70 ఏళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. పల్లె ప్రగతి పేరుతో గ్రామాలలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ల పంపిణీ
ఇవన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మురికి కాలువలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధాామాలు నిర్మిస్తామని గంప గోవర్ధన్ తెలిపారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇది నిరంతరం జరిగె ప్రక్రియ అని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:మేడారం జాతర నిర్వహణపై సీఎం సంతృప్తి