కామారెడ్డి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. చేతికందొచ్చిన పంటను నీట ముంచి, రైతుల కష్టాన్ని కన్నీళ్ల పాలు చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. నేలపాలు కావడంతో అన్నదాతల బాధ వర్ణనాతీతంగా మారింది.
గాలివాన బీభత్సం.. రైతులకు మిగిల్చింది తీరని నష్టం
కామారెడ్డి జిల్లాలో.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షానికి నీట మునిగింది. గాలివాన.. పంట చేతికి అందుతుందనుకున్న అన్నదాతల ఆశను.. నిరాశ చేసింది. జిల్లాలో కురిసిన వర్షం.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.
damage to the farmers
అకాల వర్షం కారణంగా మాచారెడ్డి మండలంలోని సోమారంపేట్, రత్నగిరి పల్లె గ్రామాల్లో వరి పంట నేల వాలి.. ఈదురు గాలుల ధాటికి పూర్తిగా నీట మునిగింది. మామిడికాయలు నేలరాలాయి. మరోవైపు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. చెట్ల కొమ్మలు విరిగి స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్టు కింద నిలిపి ఉంచిన ఓ ట్రాక్టర్ ధ్వంసమైంది.
ఇదీ చదవండి:భార్య కాపురానికి రాలేదని.. ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు