తెలంగాణ

telangana

ETV Bharat / state

లంచం అడిగిన ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు - bribe demanding

కామారెడ్డి జిల్లా మద్నూర్​ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఇసుక దందా చేస్తున్న వ్యక్తిని లంచం డిమాండ్​ చేసిన కారణంగా... విధుల నుంచి తొలగించినట్లు ఎస్పీ శ్వేత తెలిపారు.

three police constables suspended for demanding bribe
లంచం అడిగిన ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు

By

Published : May 14, 2020, 8:16 PM IST

ఇసుక దందా చేసే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్, వెంకట్​రావు, ఇలియాస్​లను విధుల నుంచి తొలగించినట్లు ఎస్పీ శ్వేత తెలిపారు.

ఇసుక దందా చేసే వ్యక్తిని చరవాణిలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావటం వల్ల పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి విచారణ చేసి బాధ్యులైన కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించారు. ఇదే విషయంలో గత నెల 26న ఇక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రేమ్​సింగ్​ను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details