కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొండచిలువను గ్రామస్తులు చంపేశారు. గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలోకి కొండచిలువ రావడంతో రైతులు భయభ్రాంతులకు గురి అయ్యారు.
మూడు మీటర్ల పొడవైన కొండచిలువ హతం - కొండచిలువ హతం
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మంండలం తిమ్మాపూర్ గ్రామంలో భారీ కొండచిలువను గ్రామస్తులు చంపేశారు. స్థానిక వ్యవసాయ క్షేత్రంలోకి రావడంతో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు.
మూడు మీటర్ల పొడవైన కొండచిలువ హతం
కొండచిలువను చూసిన రైతులు వెంటనే అప్రమత్తమై గ్రామస్తుల సహాయంతో కొట్టి చంపారు. గ్రామం చుట్టూ అటవీప్రాంతం ఉండటంతో తరచుగా పొలాల్లోకి వస్తుంటాయని గ్రామస్తులు తెలిపారు.