కామారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు, కృష్ణయ్య, రాజన్న సిరిసిల్లకు చెందిన కృష్ణ, మరో ఇద్దరు తమ బంధువును సాగనంపేందుకు శంషాబాద్ వెళ్లారు. ఓమ్నిలో తిరుగు ప్రయాణమయ్యారు. బంధువు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... సంతోషంగా వెళ్తున్న సమయంలో వారి మృత్యువు వెంటాడింది.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఓమ్ని... ముగ్గురు మృతి - రోడ్డు ప్రమాదం వార్తలు
బంధువు విదేశాలకు వెళ్తుంటే సాగనంపడానికి వచ్చిన వారిని మృత్యువు వెంటాడింది. అప్పటి వరకు సంతోషంగా ఉండి... తిరుగు ప్రయాణంలో జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న సమయంలో... రోడ్డు పక్క నిలిపి ఉంచిన లారీని ఢీకొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన ఘటన మెదక్లో చోటు చేసుకుంది.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఓమ్ని... ముగ్గురు మృతి
మెదక్ జిల్లా నార్సింగి సమీపంలో రోడ్డు వద్ద పక్కకు నిలిపి ఉంచిన లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.