లాక్డౌన్ వేళ కామారెడ్డిలో దొంగతనం - Theft in kamareddy during lock down
లాక్డౌన్ వేళ కామారెడ్డి జిల్లాలో దొంగతనం జరగటం సంచలనం సృష్టిస్తుంది. రెండు తులాల బంగారం, రూ.15 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.

లాక్డౌన్ వేళ కామారెడ్డిలో దొంగతనం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీలో దొంగతనం జరిగింది. తన తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల చూడటానికి యాదగిరి అనే వ్యక్తి అతని స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి వేళలో తాళం వేసిన ఇంటిని గమనించిన దొంగలు... అదే అదనుగా భావించి ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, రూ.15 వేలను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.