కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. సమీపంలోని బంగారు దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక వైపు నుంచి గోడకు కన్నం పెట్టి... 433 గ్రాముల బంగారం, 45.2కిలోల వెండిని దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ల సాయంతో ఆధారాలు సేకరించారు. అలాగే పాత నేరస్థుల వేలి ముద్రలు సేకరించారు. చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు.
గోడకు కన్నం పెట్టి బంగారు దుకాణం లూటీ - గోడకు కన్నం పెట్టి బంగారు దుకాణం లూటీ
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని బంగారు దుకాణంలో చోరీ జరిగింది. వెనుకవైపు గోడకు కన్నం పెట్టి 433 గ్రాముల బంగారం, 45.2 కిలోల వెండిని దోచుకెళ్లారు.
గోడకు కన్నం పెట్టి బంగారు దుకాణం లూటీ
TAGGED:
theft in gold shop