తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు కూడా లేవంటూ.. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జరగిందీ ఘటన.
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు - తాగు నీటి సమస్యలు
గత కొన్ని రోజులుగా నల్లా నీళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలంలోని ప్రజలు ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు.
తాగు నీటి కొరత
నీళ్లు రాక.. గుళ్ల వద్ద స్నానాలు చేయాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోయారు. వేసవిలో.. తాగు నీరు లేక అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి:నేడు పలుజిల్లాల్లో తేలికపాటి వర్షాలు