కామారెడ్డి జిల్లాలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది. మహారాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న వైన్స్లలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మాస్క్లు వేసుకుని..

అర్ధరాత్రి సమయంలో రెండు మద్యం దుకాణాల షట్టర్లు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఒక దుకాణంలో రూ. 2,48,080, మరో దాంట్లో రూ. 25 వేల నగదు చోరీ జరిగినట్లు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని బిచ్కుంద సీఐ సాజిద్ పరిశీలించి దుండగులు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు వివరించారు. ముఖం కనిపించకుండా మాస్కులు వేసుకున్నారని తెలిపిన ఆయన.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
ఇదీ చదవండి:నల్గొండ జిల్లాలో గురి తప్పిన ధాన్యం అంచనాలు