కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు వద్ద ఏర్పాటు చేస్తోన్న మినీ ట్యాంక్ బండ్ పనులను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. పట్టణ పరిసర ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు ఈ మినీ ట్యాంక్ బండ్‌ను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యటకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులు పనుల పట్ల అలసత్వం వహించకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సభాపతి వెంట ఏఈ కిరణ్, డీఎస్పీ దామోదర్ రెడ్డి, పట్టణ సీఐ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించిన సభాపతి - శాసన సభాపతి
కామారెడ్డి జిల్లాలోని కల్కి చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.

మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించిన సభాపతి
మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించిన సభాపతి
ఇవీ చూడండి: కొడవలితో మహిళ హల్చల్.. పింఛన్ కోసం బెదిరింపు