కలకలం రేపుతున్న వృద్ధురాలి హత్య - కామారెడ్డి
అల్మాజిపూర్ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
కలకలం రేపుతున్న వృద్ధురాలి హత్య
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో వృద్ధురాలి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన బత్తుల బాల్ లింగవ్వ ఒంటరిగా ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకు బ్రతుకుదెరువు కోసం మెదక్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు. ఉదయం నుంచి లింగవ్వ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.