కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని బెస్తగల్లీలో శనివారం సాయంత్రం దుప్పి సంచారం స్థానికంగా కలకలం రేపింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా రావడంతో బయట కూర్చున్న మహిళలు ఉలిక్కిపడ్డారు. అది దుప్పి అని స్థానికులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పొలాల్లో జంతువును చూసి భయం.. దుప్పని తెలిసేసరికి... - కామారెడ్డి జిల్లా లేటెస్ట్ న్యూస్
గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం ఇటీవల కలకలం రేపుతోంది. పులులు, దుప్పి వరుసగా జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో దుప్పి సంచారం కలకలం సృష్టించింది.
గ్రామంలోకి వచ్చిన దుప్పి... భయాందోళనలో స్థానికులు
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా... రాత్రి 10 గంటల వరకు శ్రమించి దుప్పిని బంధించారు. భిక్నూర్ మండలంలోని తిప్పపూర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు.