కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరెంజ్ జోన్‌లో ఉన్న జిల్లాలు 21 రోజుల పాటు కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకుంటే గ్రీన్ జోన్ పరిధిలోకి చేర్చనున్నారు. కామారెడ్డి జిల్లాలో గత 20 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. మరో రెండు రోజుల్లో కరోనా రహిత జిల్లాగా ప్రకటించి గ్రీన్‌జోన్ పరిధిలోకి చేర్చనున్నారు.
వలస కార్మికుల వివరాలు నమోదు...
కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే వలస కార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా వలస కార్మికుల వివరాలను నమోదు చేసే బాధ్యతను పోలీసులతో పాటు రెవెన్యూ, వైద్య శాఖ సిబ్బందికి అప్పగించారు. టీఎస్ కరోనా ట్రాకర్ అనే యాప్‌లో వలస కార్మికుల పూర్తివివరాలు నమోదు చేసి వారు ఇంట్లోనే 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్దేశించనున్నారు.
బాన్సువాడ పట్టణంలో...