తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం - Peanut Purchase Center in kamareddy

రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరంలేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.

the government vip Gampa Govardhan opened the Peanut Purchase Center in kamareddy
కామారెడ్డిలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

By

Published : Apr 14, 2020, 1:36 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాటశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకువచ్చిన శనగలను తూకం వేశారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ రబీలో అంచనాకు మించిన ధాన్యం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం నీటి ద్వారా మరింత పంటల దిగుబడి వస్తుందని వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొనిరావాలని తెలిపారు.

ఇవీ చూడండి:పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్​రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details