బడుగు బలహీన వర్గాల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారంలో ఐదు నెలల క్రితం హత్యకు గురైన జంగాని సవిత (21) కుటుంబ సభ్యులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సవిత హత్యకు గురై 5 నుంచి 6 నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ పోలీసులు నిందితులను గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. రెండు రోజుల్లో నిందితులను పట్టుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం గిరిజన మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
'బలహీన వర్గాల మహిళలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది' - మందకృష్ణ మాదిగ తాజా వార్తలు
కామారెడ్డి జిల్లాలోని రుద్రారంలో 5 నెలల క్రితం హత్యకు గురైన జంగాని సవిత కుటుంబ సభ్యులను మందకృష్ణ మాదిగ పరామర్శించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'బలహీన వర్గాల మహిళలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది'
ఇదీ చూడండి: గ్రహణం లెక్క తేల్చిన రోకలి-సూదులు!
TAGGED:
మందకృష్ణ మాదిగ తాజా వార్తలు