తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీల రోడ్డు ప్రమాద ఘటనలో 3కు చేరిన మృతుల సంఖ్య - కామారెడ్డి జిల్లా తాజా వార్తలు

కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న వలస కూలీల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మొదటగా చికిత్స పొందుతూ మరణించగా.. తాజాగా మరో ఇద్దరు చనిపోయారు. జిల్లా ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పాలనాధికారి శరత్​ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

వలస కూలీల రోడ్డు ప్రమాద ఘటనలో 3కు చేరిన మృతుల సంఖ్య
వలస కూలీల రోడ్డు ప్రమాద ఘటనలో 3కు చేరిన మృతుల సంఖ్య

By

Published : May 13, 2020, 12:09 AM IST

కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం దగ్గి దగ్గర మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​కు చెందిన 20 మంది వలస కూలీలతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం టైర్ పేలి బోల్తా పడింది. అయితే ముందుగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

వారిలో ఇద్దరైన అవదేశ్​, బిహారీ రాం.. రాత్రి 10 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మరణించారు. కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్​ శరత్​ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇదివరకే ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి స్పందించారు. ఈ లాక్​డౌన్​ వేళ కార్మికులు స్వస్థలాలకు వెళ్లే సమయంలో ప్రమాదం జరగడం బాధకరమన్నారు.

ఇవీ చూడండి:పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన

ABOUT THE AUTHOR

...view details