తెలంగాణ

telangana

ETV Bharat / state

బాన్సువాడలో పది రోజులు స్వచ్ఛంద లాక్​డౌన్ - బాన్సువాడలో 7 నుంచి 17వ తేదీ వరకు స్వచ్ఛందంగా లాక్​డౌన్

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎలాగైనా సరే కరోనాను కట్టడి చేయాలనుకున్న అధికారులు ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు.

voluntary lockdown in baswada
బాన్సువాడలో పది రోజులు స్వచ్ఛంద లాక్​డౌన్

By

Published : Aug 3, 2020, 4:45 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలనే నిర్ణయంతో పట్టణంలోని స్థానిక ఆర్అండ్​బీ గెస్ట్ హౌజ్​లో ​అఖిల పక్ష నేతలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు భేటీ అయ్యారు. కరోనా వైరస్ కట్టడి కోసం స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్​డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 7వ తేదీ నుంచి 17 వరకు సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. లాక్​డౌన్​ పాటించకుండా బయట తిరిగితే 1000 రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వర్తక వాణిజ్య సంస్థల యజమానులు, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, వైస్ ఛైర్మన్ జుబెర్, కౌన్సిలర్లు, అధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

ABOUT THE AUTHOR

...view details