కామారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహంతో పలు చోట్ల పంటలు నీటమునిగాయి. కొన్ని మండలాల్లో తాత్కాలిక రోడ్లు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి వద్ద వరద ఉద్ధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. వంతెన నిర్మాణంలో ఉండగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయి జుక్కల్- మద్నూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షం కారణంగా తెగిపోయిన రోడ్లు.. నిలిచిపోయిన రాకపోకలు
కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎటు చూసినా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది.
వర్షం కారణంగా తెగిపోయిన రోడ్లు.. నిలిచిపోయిన రాకపోకలు
బిచ్కుంద మండలం పెద్ద దేవడా- పుల్కల్ మధ్య కౌలాస్ వాగుపై నిర్మిస్తున్న వంతెన వద్ద తాత్కాలిక రోడ్డు తెగిపోయి బాన్సువాడ-బిచ్కుంద మధ్య రాకపోకలకు అంతరాయ ఏర్పడింది. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార వద్ద జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వంతెన వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయింది. దీంతో ఒక మార్గంలోనే రాకపోకలు సాగుతున్నాయి.