తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాంసాగర్​ ప్రాజెక్టు సందర్శనలో సభాపతి.. గంగమ్మకు ప్రత్యేక పూజలు - pocharam visited nizam sagar project

నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం వల్ల 2లక్షల 70వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ జలాశయాన్ని సందర్శించిన పోచారం.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

telangana speaker pocharam srinivas reddy
నిజాంసాగర్​ ప్రాజెక్టు సందర్శనలో సభాపతి.

By

Published : Oct 16, 2020, 3:12 PM IST

శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. నిజాంసాగర్ జలాశయాన్ని సందర్శించి.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును సందర్శిస్తూ.. ప్రకృతి అందాలను తిలకించారు.

వరి ప్రధానమైన.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం వల్ల 2 లక్షల 70 వేల ఎకరాలకు సాగునీరందుతాయని పోచారం తెలిపారు. తర్వలో మల్లన్న సాగర్ నుంచి 24 కిలోమీటర్ల కాలువ తీసి హల్ది వాగులో కలుపుతామని వెల్లడించారు.

అక్కణ్నుంచి రూ.1500 కోట్లతో ఆరువేల క్యూసెక్కుల నీళ్లు నిజాంసాగర్​లోకి చేరుతాయని చెప్పారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగులోకి 9 టీఎంసీల నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్న పోచారం.. త్వరలోనే నిజాంసాగర్​లోకి కాళేశ్వరం నీళ్లు వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details