నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, నాగిరెడ్డిపేట్ జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, లింగంపేట్ జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరారు.
'సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై చేరారు' - kamareddy district latest news
సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరుతున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తదితరులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
'సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై చేరారు'
హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెరాసలో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆత్మకూర్ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ తదితరులు పాల్గొన్నారు.