తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షన్​పై ప్లకార్డులతో విద్యార్థుల అవగహన - Kamareddy district latest news

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించారు. తడి, పొడి చెత్తపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు విద్యార్థులు అవగాహన కల్పించారు. స్వచ్ఛ మున్సిపాలిటీకి అందరు సహకరించాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్ కోరారు.

Swachha sarvekshan was conducted in Banswada municipality
స్వచ్ఛ సర్వేక్షన్​పై ప్లకార్డులతో విద్యార్థుల అవగహన

By

Published : Mar 3, 2021, 4:00 PM IST

తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనంలో వేయాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్ అన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీకి అందరు సహకరించాలని కోరారు.

బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు, విద్యార్థులు, వైద్య సిబ్బంది కలిసి అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తడి, పొడి చెత్తపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు విద్యార్థులు అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి:ఆరేళ్లుగా ప్రశ్నిస్తున్నా.. మరో అవకాశం ఇవ్వండి: రాంచందర్​రావు

ABOUT THE AUTHOR

...view details