కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని సంగోజివాడి, కాళోజీవాడి గ్రామాల మధ్య ప్రవహించే వాగు ఆదివారం కురిసిన భారీ వర్షానికి పొంగి ప్రవహించింది. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
రెండు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు - భారీ వర్షానికి పొంగిన వాగులు
రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహం రహదారులపై చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతవాసుల రవాణా స్తంభించిపోయింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రెండు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
కామారెడ్డి, చుట్టుపక్కల గ్రామాలకు నిత్యావసరాలు, పాలు, కూరగాయలు ఇతర సరుకులు తీసుకెళ్లి అమ్ముకునే వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. వర్షానికి మొక్కజొన్న పంట తడిచిపోయిందని రైతులు వాపోయారు. తమకు ప్రభుత్వం నష్టం పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :పోలీసుల ఆంక్షలు... భక్తులకు తప్పని తిప్పలు