ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ. కోటి నిధులతో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో సుమారు 236 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం.. శాఖ తరఫున దళితులకు 90 శాతం సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తోందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం.. అంబేడ్కర్ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు.