annadana Kendram in Kamareddy district: బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి సరైన ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటిది మాలధారణలో ఉన్న అయ్యప్ప భక్తులకు భిక్ష దొరకడం చాలా అరుదు. ఒకవేళ భిక్ష దొరకలేదంటే మరుసటి రోజు వరకు ఆకలితో అలమటించాల్సిందే. స్వాముల బాధలను గమనించిన శ్రీనివాసరావు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ 44 వజాతీయ రహదారి వద్ద నిత్యాన్నదాన ఏర్పాట్లు చేశారు. ఈ అన్నదాన కేంద్రం వద్ద నిత్యం దాదాపు 300 మంది దాకా భుజిస్తారు. అంతేకాకుండా స్థానికంగా నిర్మించే అయ్యప్ప ఆలయానికి శ్రీనివాసరావు రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.
"ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే స్వామి వారు స్వప్నంలో కనిపించి అభయమిచ్చినట్టుంది. 60 రోజుల అన్నదాన కార్యక్రమానికి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణం నిమిత్తం ఆయన్ని కలిసినప్పుడు రూ.5 లక్షల 18 వేలు విరాళంగా ఇచ్చారు. అన్నదానానికి కావాల్సిన ఖర్చు మొత్తం ఆయనే విరాళంగా ఇచ్చారు. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్న ముందుండి నడిపిస్తానన్నారు."-అయ్యప్ప భక్తుడు