శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబసమేతంగా పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు.
కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం - తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
![కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం Sri venkateswara swamy kalyanam at banswada constituency in birkur mandal thimmapur village kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11100012-844-11100012-1616328842920.jpg)
కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం
కనులవిందైన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణం వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.