తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ మహిళా సంఘంగా శ్రీ బాలాజీ పొదుపు సంఘం - మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 30 మహిళా సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా సంఘాలుగా ప్రకటించింది. అందులో కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలోని శ్రీ బాలాజీ మహిళా పొదుపు సంఘం పేరు ఉండటం జిల్లాకు ఉత్తమ పేరు తీసుకువచ్చింది. నేడు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు అవార్డు అందుకోనున్నారు.

sri-balaji-savings-society-had-place-in-the-best-womens-association-in-india
ఉత్తమ మహిళా సంఘంగా శ్రీ బాలాజీ పొదుపు సంఘం

By

Published : Mar 8, 2021, 1:42 PM IST

కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలోని శ్రీ బాలాజీ మహిళా పొదుపు సంఘం 1999లో పది మంది సభ్యులతో మొదలైంది. ప్రతి నెల 10 రూపాయల చొప్పున పొదుపు చేసుకునేవారు. పొదుపును పెంచుకుంటూ ప్రస్తుతం 100కు చేరింది. పొదుపుల ద్వారా జమ అయిన డబ్బును తమ అవసరాలకు వాడుకుంటున్నారు. సక్రమంగా రుణవాయిదాలు చెల్లిస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు.

ఉత్తమ మహిళా సంఘంగా శ్రీ బాలాజీ పొదుపు సంఘం

ఇలా తీసుకున్న రుణంతో భూమి, బంగారం, వెండి కొనుగోలు చేసుకుంటున్నారు. కొంతమంది దుకాణాలు, కోళ్ల ఫామ్‌లు ఏర్పాటు చేసుకుని స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. నెలనెలా కొంత జమ చేస్తూ ఆర్థిక సాధికారత సాధిస్తున్నట్లు మహిళలు తెలిపారు.

ఈ అవార్డు గతేడాది వచ్చినా కరోనా కారణంగా కార్యక్రమం రద్దయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 30 మహిళా సంఘాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవార్డులను అందజేయనున్నారు.

ఇదీ చూడండి:చదువుల తల్లి: పాఠాలతోనే నాన్నకు గుణపాఠం

ABOUT THE AUTHOR

...view details