కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్లో కస్తూర్భా బాలికల గురుకుల విద్యాలయాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఉదయంపూట అల్పాహారంలో భాగంగా పెట్టే ఉప్మాని తిని చూశారు.
ఉప్మా రుచి సరిగ్గా లేకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయుడిపై, భోజన నిర్వాహకులపై మండిపడ్డారు. వంట చేసేందుకు నాసిరకమైన వస్తువులను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడి పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లే భోజన నిర్వాహకులు ఇలా వంట చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.