కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 14వ వార్డులో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం - పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటన
వార్డులను అభివృద్ధి చేసే బాధ్యత కౌన్సిలర్లదేనని సభాపతి పోచారం శ్రీనివాస్ తెలిపారు. బాన్సువాడలోని 14వ వార్డులో పర్యటించి అక్కడి సమస్యలను గురించి తెలుసుకున్నారు.
బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం
అనంతరం కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. వాడలను అభివృద్ధి చేసే బాధ్యత కౌన్సిలర్లదేనని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వలనే రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణం జరుగుతుందని స్పీకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్ నందకిషోర్, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, ఆర్డీవో రాజేశ్వర్తో పాటు సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..