తెలంగాణ

telangana

ETV Bharat / state

జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలపై స్పీకర్​ సమీక్ష - స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి తాజా వార్తలు

జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలపై సభాపతి శ్రీనివాస్ రెడ్డి తన చాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రెండు ఎత్తిపోతల నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని ఇరిగేషన్ అధికారులు స్పీకర్‌కు వివరించారు.

pocharam srinivas reddy news
speaker review

By

Published : Mar 25, 2021, 3:31 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని, చందూరు మండలాల పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలపై స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి సమీక్షించారు. ఈ రెండు నిర్మాణాలకు ఈ ఏడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ పొందుపరిచారని వెల్లడించారు. గతంలోనే ఈ రెండు ఎత్తిపోతల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని పేర్కొన్నారు.

జాకోరా, చందూరు ఎత్తిపోతల నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని ఇరిగేషన్ అధికారులు స్పీకర్‌కు వివరించారు. ఈ ప్రాంతంలోని మెట్టభూములు అన్ని కూడా రెండు ఎత్తిపోతల పథకాల పరిధిలోకి వచ్చే విధంగా పూర్తిస్థాయిలో మరోసారి సర్వే నిర్వహించాలని అధికారులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి:సాగునీటికై రోడ్డెక్కిన దుర్శేడు గ్రామస్థులు..

ABOUT THE AUTHOR

...view details