కామారెడ్డి జిల్లా నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వాహించారు. నియోజకవర్గ పరిధిలో 5 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 106 గ్రామాల్లో రూ. 300 కోట్ల నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మెజారిటీ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
'మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలి' - డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు
లాక్డౌన్ సమయంలోనే అభివృద్ధి పనులను ముగించుకోవాలని స్పీకర్ పోచారం అధికారులకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
'మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలి'