ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు.
అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కోట్ల రూపాయలు దానం చేసిన దానికంటే రక్తదానం ఎంతో మేలని అన్నారు. రక్తదానంతో మరో వ్యక్తి ప్రాణాలను నిలబెట్టొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా యువర్స్ లైఫ్ యూత్ సభ్యులను అభినందించారు.