తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల సొంతింటి కలను నిజం చేసిన సీఎం : పోచారం - డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆరేనని సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్​ తండాలో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.

speaker pocharam districbuted double bed romm houses
పేదల సొంతింటి కలను నిజం చేసిన సీఎం : పోచారం

By

Published : Feb 16, 2021, 7:21 PM IST

రాష్ట్రంలో అందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ తండాలో కొత్తగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రూ.5 లక్షల 4 వేల రూపాయలతో ఇళ్లు నిర్మిస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. ఇలాంటి పథకం ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పోచారం వెల్లడించారు.

ఇదీ చూడండి :క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details