కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట, ఇబ్రహీంపేట గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మని... ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారని స్పీకర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో కోలాటం ఆడిన సభాపతి - saddula_bathukamma_celebrations
బాన్సువాడలోని సద్దుల బతుకమ్మ వేడుకల్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో కోలాటం చేసిన సభాపతి
Last Updated : Oct 7, 2019, 9:51 AM IST