తెలంగాణ

telangana

ETV Bharat / state

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సభాపతి - telangana latest news

కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్​లో సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

speaker pocharam initiated several development works at thimmapur
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సభాపతి

By

Published : Mar 18, 2021, 10:51 PM IST

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్​లో స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పర్యటించారు. రూ.3 కోట్లతో నిర్మించిన సెంటర్ డివైడర్ సీసీ రోడ్డు, డ్రైనేజీ, సెంటర్ లైట్ పనులను ప్రారంభించారు.

నసురుల్లాబాద్ చౌరస్తా నుంచి బీర్కూర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.8 కోట్లు మంజూరు చేశామని పోచారం పేర్కొన్నారు. తిమ్మాపూర్ గ్రామ మెయిన్ రోడ్ అభివృద్ధి కోసం మరో రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు. పర్యాటక రంగంలో భాగంగా రూ.6 కోట్ల నిధులతో బోట్ ఏర్పాటు, చెరువు అభివృద్ధి చేసినట్లు స్పీకర్​ వివరించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్​ను గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐపాడ్​లు

ABOUT THE AUTHOR

...view details