తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యార్థి జీవితానికి బంగారు బాటలు వేసేది గురువులేనని శాసన సభ స్వీకర్ పోచారం అన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొత్తబాద్లో నిర్వహించిన తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. చిన్నారులతో కలిసి స్పీకర్ కొంత సమయం ఆడిపాడారు. విద్యతోనే సకల ప్రయోజనాలను పొందవచ్చని.. విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని విద్యార్థులకు స్పీకర్ తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీడీవో యవర్ హుస్సేన్ సుఫి, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
'విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చు' ఇదీ చూడండి: 'స్పైస్ బోర్డు కాదు... పసుపు బోర్డు కావాలి'