తెలంగాణ

telangana

ETV Bharat / state

గృహ నిర్మాణాలను పరిశీలించిన స్పీకర్, మంత్రి వేముల - సంగమేశ్వర కాలనీ

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్మాణాలను పరిశీలించారు. పేదల పట్ల స్పీకర్ పోచారానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమే సంగమేశ్వర కాలనీలో రెండు పడకల గదుల నిర్మాణమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

గృహ నిర్మాణాలను పరిశీలించిన స్పీకర్, మంత్రి వేముల
గృహ నిర్మాణాలను పరిశీలించిన స్పీకర్, మంత్రి వేముల

By

Published : Jun 5, 2020, 10:10 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నిర్మిస్తున్న 200 రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి వేముల పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలోనూ పర్యటించారు. అక్కడ నిర్మిస్తున్న నివాసాలను సందర్శించారు.

స్పీకర్ ప్రత్యేక శ్రద్ధ వల్లే..

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే పట్టణంలోని కాలనీలో 200 గృహాలు నిర్మాణం అవుతున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సంగమేశ్వర కాలనీ పరిధిలో సుమారు 70 ఎకరాల్లో పూర్తి మౌలిక వసతులతో నివాస సముదాయాలను నిర్మించడం గొప్ప విషయమని మంత్రి కీర్తించారు. పెద్ద ఎత్తున అన్ని రకాల వసతి గృహాలు నిర్మించడం కేవలం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే చెల్లిందన్నారు.

ఇవీ చూడండి : ' మే 19 ఆదేశాలు పాటిస్తేనే పది పరీక్షలకు అనుమతి'

ABOUT THE AUTHOR

...view details