కామారెడ్డి జిల్లా లింగపూర్ గ్రామానికి చెందిన ఎనగుర్తి రాజలింగంకు ఒకే ఒక్క కూతురు భీమవ్వ. కొడుకులు లేకపోవడంతో లింగంపేట్ మండలం ఐలపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ను ఇల్లరికం తెచ్చుకున్నాడు. కూతురితో కలిసి రాజలింగం ఇంట్లోనే నివసిస్తున్నాడు.
సోమవారం రాత్రి బైక్ విషయంలో మామాఅల్లుళ్లకు చిన్నపాటి గొడవ జరిగింది. ఉదయం మాట్లాడుకుందామని అనుకున్నారు. రాత్రి పదకొండు గంటలకు ఇంటి ముందు జరుగుతున్న రిసెప్షన్ వద్దకు భీమవ్వ వెళ్లింది.