కామారెడ్డి జిల్లా దోమకొండ, బీబీపేట మండలాల్లో కాళేశ్వరం నీరు బ్యాక్ వాటర్ వల్ల అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానేరు జలాశయం పరిధిలోని రైతులు... పట్టా భూములకు కింద భాగంలో సుమారు 1500 నుంచి 2000 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. అయితే... రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీటిని వదలడంతో... కూడెల్లి వాగు నుంచి మానేరులోకి నీరు వచ్చింది. మరో నాలుగు ఫీట్ల మేర వస్తే పూర్తిగా నిండుతోంది. దీనివల్ల బ్యాక్ వాటర్ చేరి రైతుల పొలాలు నీట మునిగిపోతున్నాయి.
మానేరు జలాశయంలో బ్యాక్ వాటర్ ద్వారా సుమారు 400 వందల నుంచి 500 ఎకరాల పంట నీట మునిగింది. సరిగ్గా పంటచేతికొచ్చే సమయానికి నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సమయంలో అక్కడ నీళ్లు ఉండేవి కాదని... అందువల్లే సాగు చేశామని కర్షకులు తెలిపారు. ఒక్క నెలరోజులపాటు నీటి విడుదల నిలిపియాలని కోరారు.