Siddharamaiah Speech in BC Declaration Sabha at Kamareddy :సీఎం కేసీఆర్‌పై భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలవడం ఖాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddharamaiah) తెలిపారు. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ(BC Declaration Sabha)లో పాల్గొన్న సిద్ధరామయ్య.. బీసీ డిక్లరేషన్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. అనంతరం కేసీఆర్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారని.. అలాగే మరోచోట కూడా పోటీ చేస్తున్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివరించారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా రెండు చోట్లా పోటీ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న రెండు చోట్లా కూడా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌పై భారీ మెజారిటీతో టీపీసీసీ అధ్యక్షుడు గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు.
BC Declaration Sabha at Kamareddy :మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. ఇందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చేసిన కేసీఆర్ పదేళ్ల పాలనలో అంతా అవినీతి రాజ్యమే ఏలిందని ధ్వజమెత్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ అధినేతను ఓడించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే ప్రజలు కేసీఆర్‌ను ఓటుతోనే ఇంటికి పంపాలని.. ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో బీజేపీ పనైపోయిందని.. ఆ పార్టీకి నాలుగు సీట్లు వస్తే అవే చాలా ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. మోదీ నాలుగైదు సార్లు ప్రచారానికి వచ్చిన.. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు.
Congress Party speed up Election Campaign : ఆరు గ్యారెంటీలే ఆపన్న'హస్తం'గా.. కాాంగ్రెస్ ముమ్ముర ప్రచారాలు
"తెలంగాణలో చంద్రశేఖర్ రావు పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో.. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది అంతే వాస్తవం. ఈ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవడమే ఎక్కువ. నరేంద్ర మోదీ వచ్చి వందసార్లు ప్రచారం చేసిన ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేయడం లేదని కేసీఆర్ అంటున్నారు. ఒకసారి అక్కడికి వస్తే తెలుస్తోంది అమలు చేస్తున్నామో లేదో అన్నది. తెలంగాణ ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో అమలు చేస్తుంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలను తిరస్కరించి.. కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి."- సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం
5 గ్యారెంటీలను చూడడానికి కేసీఆర్ కర్ణాటక రావాలి : కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రచారానికి ప్రధాని మోదీ 48 సార్లు వచ్చారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. అప్పుడు మోదీ ఎక్కడ ప్రచారం చేశారో.. అక్కడే కాంగ్రెస్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికలో మోదీని నమ్ముకున్న కర్ణాటక బీజేపీ నేతలు.. ఆ తర్వాత తలపట్టుకున్నారన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాల కోరు.. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ చాలా అవకాశాలు ఇచ్చిందని నొక్కి చెప్పారు.
కానీ బీఆర్‌ఎస్, బీజేపీ.. బీసీలకు, ఎస్సీలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికలో తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేమని బీజేపీ ఆరోపించింది.. కానీ వారం రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసి చూపించామని అన్నారు. అలాగే కేసీఆర్ సైతం ఇదే మాట అంటున్నారు.. ఒకసారి వచ్చి అక్కడ ఎలా ఉందో చూసి వెళ్లండని సీఎం సిద్ధరామయ్య సూచించారు.
సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు - ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారెంటీలు వివరిస్తున్న అభ్యర్థులు
ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్