కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మండల విద్యాధికారి ఎల్లయ్య పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు - kamareddy education officer yellaiah
ప్రభుత్వ ఆదేశాలొచ్చే వరకు పాఠశాలలు తెరవద్దని చెప్పినా.. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గుట్టు చప్పుడు కాకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయి.
![కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు shokaj notice to kamareddy gowtham model school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8508051-304-8508051-1598019698864.jpg)
కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు
ఈ తనిఖీల్లో మూడు గదుల్లో పుస్తకాలు విక్రయించడం గుర్తించిన ఎల్లయ్య.. ఆ గదులను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న గౌతమ్ మోడల్ పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.