తెలంగాణ

telangana

ETV Bharat / state

జంగంపల్లిలో శ్రీరాముని చిత్ర పటంతో శోభాయాత్ర - కామారెడ్డి జిల్లా వార్తలు

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముని చిత్ర పటంతో శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణకు పలు గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.

Shobhayatra with a picture of Lord Rama at Jangampally in kamareddy district
జంగంపల్లిలో శ్రీరాముని చిత్ర పటంతో శోభాయాత్ర

By

Published : Jan 20, 2021, 4:12 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణకు చేపట్టిన శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముని చిత్ర పటంతో రథయాత్ర నిర్వహించారు.

కార్యక్రమంలో ప్రజలు, చిన్నారులు, యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. రామ మందిర నిర్మాణం హిందువుల కల అని.. ఆ కలను సాకారం చేసుకునే అవకాశం రావడం సంతోషమని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. నిర్మాణానికి ప్రజలు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి: 'కేటీఆర్​ను సీఎం చేయడానికి కేసీఆర్ దోషనివారణ​ పూజలు చేశారు'

ABOUT THE AUTHOR

...view details