'రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కృషి చేయండి' - ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికలతో కేసీఆర్‌కు ఏం సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో జహీరాబాద్ అభ్యర్థి మదన్‌మోహన్‌తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు.
'రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కృషి చేయండి'
కార్యకర్తలు బాగా శ్రమించి జహీరాబాద్ అభ్యర్థి మదన్మోహన్రావును భారీ మోజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కోరారు. కామారెడ్డి జిల్లా మద్దికుంటలో హస్తం అభ్యర్థి మదన్‌మోహన్‌తో పాటు రామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఏటా ప్రతి కుటుంబ ఖాతాలో రూ.72 వేలు వేస్తామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.