కామారెడ్డి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రూ. 5 వందల విద్యుత్ బిల్లు వచ్చే ఇంటికి ఏకంగా 7 లక్షల 29 వేల 471 రూపాయల బిల్లు వచ్చింది. దాంతో ఆ ఇంటి యజమాని ఒక్కసారి అవాక్కయ్యాడు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన గాండ్ల శ్రీనివాస్ వృత్తిరీత్యా రైతు. అతని ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు రూ. 5 వందల బిల్లు వచ్చేది. ఫిబ్రవరిరో కూడా రూ. 415 మాత్రమే చెల్లించాడు.
ఆ ఇంటి బిల్లు అక్షరాల 7లక్షల రూపాయలు - ఏడు లక్షల కరెంట్ బిల్లు
కరెంట్ షాక్ తెలుసు కానీ.. విద్యుత్ బిల్లు షాక్ విన్నారా? కామారెడ్డి జిల్లా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిజంగానే షాక్ కొట్టినంత పనైంది. ఐదు వందలు వచ్చే ఇంటికి... ఏకంగా ఏడు లక్షలకుపైగా కరెంట్ బిల్లు ఇచ్చారు. ఇది చూసిన ఇంటి యజమాని నిజంగానే కరెంట్ షాక్ కొట్టినట్టు గిలగిలాకొట్టుకున్నాడు.

ఆ ఇంటి బిల్లు అక్షరాల 7లక్షల రూపాయలు
మార్చి, ఏప్రిల్, మే నెలలో కరోనా వల్ల విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీసుకోలేదు, బిల్లు ఇవ్వలేదు. మూడు నెలలది కలిపి ఈ నెలలో ఇచ్చారు. బిల్లు చూసి సొమ్మసిల్లినంత పనైంది ఆ ఇంటి యజమానికి. వెయ్యా, రెండు వేలా..? ఏకంగా 7 లక్షల 29 వేల 471 రూపాయలు. తాము బిల్లు ఎలా చెల్లించాలో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తున్నాడు. న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు.
ఆ ఇంటి బిల్లు అక్షరాలు 7లక్షల రూపాయలు
Last Updated : Jun 12, 2020, 9:57 AM IST
TAGGED:
ఏడు లక్షల కరెంట్ బిల్లు