కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజుల... 300 మంది పాఠశాల విద్యార్థులు, స్థానికంగా ఉన్న నిరుపేదలకు వారం రోజులకు సరిపోయే కూరగాయలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం టొమాటో రైస్ పొట్లాలను అందజేశారు.
విద్యార్థులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన టీచర్ - ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజుల
సాధారణంగా గురువులు విద్యాదానం, జ్ఞాన దానం చేస్తారు. కానీ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజుల పాఠశాల విద్యార్థులకు నిత్యావసర సరకులు దానం చేశారు.
![విద్యార్థులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన టీచర్ school teacher distributed grocery to students and local people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7107158-thumbnail-3x2-nzb.jpg)
విద్యార్థులకు నిత్యావసరాల పంపిణీ చేసిన టీటర్
తన మామ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థం పేదలకు సహాయం చేస్తున్నామని మంజుల తెలిపారు. గతంలో ఆయన రామారెడ్డిలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.
ఇదీ చూడండి:ఊహకందని విషాదం... సాగరతీరం కన్నీటి సంద్రం