కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మల్లపూర్ గ్రామ సర్పంచ్ ధర్మవ్వ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచారు. రాష్ట్రంలో ఎవరూ తిండికి ఇబ్బంది పడకూడదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. పేద కుటుంబమైనప్పటికీ ధర్మవ్వ పేదలకు నిత్యావసరాలు అందించి పలువురి చేత అభినందనలు అందుకుంది. తాను పేద పరిస్థితుల్లో ఉన్నప్పటికీ శక్తికి మించి సాయం చేస్తున్న ధర్మవ్వకు పలువురు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన తనకు.. పేదల బాధలు తెలుసు కాబట్టే.. తన శక్తిమేరకు సాయం చేశానని ధర్మవ్వ అన్నారు.
పేదలకు నిత్యావసరాలు పంచిన సర్పంచ్ - Sarpanch Distribute Groceries In Kamaredddy District Madnur
లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మల్లపూర్ సర్పంచ్ ధర్మవ్వ నిత్యావసరాలు పంచారు. ఎల్లప్పుడు పేదలకు అందుబాటులో ఉంటానన్నారు.

పేదలకు నిత్యావసరాలు పంచిన సర్పంచ్