కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూనియర్ కళాశాల మైదానం రంగవల్లులతో చూపరులను ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని .. బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సంక్రాంతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా ముగ్గులతో మైదానాన్ని ముస్తాబు చేశారు.
సంక్రాంతి సంబురం... బాన్సువాడలో ముగ్గుల పోటీలు - rangoli competition banswada
సంక్రాంతి పండుగ సందర్భంగా.. కామారెడ్డి జిల్లాలో ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేతుల మీదుగ బహుమతులు అందజేశారు.
సంక్రాంతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా.. ముగ్గుల పోటీలు
విజేతలకు డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జ్ఞాపికతో పాటు రూ. మూడు వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సంక్రాంతికి ఊరికెళితే ముందే చెప్పండి: సీపీ